భారత్‌లో 11వేలు దాటిన కరోనా కేసులు
ప్రాణాంతక కరోనా మహమ్మారి భారత్‌లో మరిన్ని ప్రాణాలు బలిగొంటోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారి భారత్‌లో మరిన్ని ప్రాణాలు బలిగొంటోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా 38 మంది మృతిచెందారు. నిన్నటితో పోల్చితే ఏడుగురు అధికంగా చనిపోయారు. తాజా మరణాలతో కలిపి భారత్‌లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 377కి చేరుకుంది. భారత్‌లో కరోనా కేసులు 11వేలు దాటిపోయాయి. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 11,439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
నిన్న ఒక్కరోజే 1076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మొత్తం 11,439 కేసులలో ఇప్పటివరకూ 1,306 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 9,756 యాక్టివ్ కేసులున్నాయని, వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. Photos: ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు
ఏప్రిల్ 14న 21 రోజులపాటు కొనసాగిన లాక్‌డౌన్ గడువు ముగిసింది. కరోనా వైరస్ వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో ఈ గడువును మే 3వ తేదీ వరకు పెంచుతున్నట్లు మంగళవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos